నాలుగున్నరేళ్లు పోరాడి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును సాధించుకున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శాసనసభలో సమాచార - పౌరసంబంధాలు, శాసనవ్యవస్థ, న్యాయపాలన పద్దులపై జరిగిన చర్చలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. సుప్రీంకోర్టు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎన్నోమార్లు విజ్ఞప్తి చేస్తే హైకోర్టు ఏర్పాటయ్యిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అవసరానికి అనుగూణంగా కోర్టులను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. హైకోర్టు, జిల్లా, స్పెషల్ కోర్టుల ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కోర్టులో పేరుకుపోతున్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిద్వారా పేదలు, బలహీన వర్గాలవారికి తక్షణ సాయం అందుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ సభ రేపటికి వాయిదా వేశారు.
"రాష్ట్రంలో ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తోంది"
"సుప్రీంకోర్టు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే హైకోర్టు ఏర్పాటయ్యింది... రాష్ట్ర ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అవసరానికి అనుగుణంగా కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం... కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం.." - ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి
"రాష్ట్రంలో ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తోంది"