హైదరాబాద్లో వర్షం కారణంగా రహదారులపై ఏర్పడ్డ గుంతలను రెండు రోజుల్లో పూడ్చివేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు. ఈ పనులకు సోమవారం అత్యవసర టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లతో దృశ్యమాధ్యమ సమీక్షలో... రోడ్ల మరమ్మతులకు రూ. 43కోట్లు అవసరమవుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో రోడ్లపై 4వేల గుంతలు పడగా... 987 మార్గాలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు.
'యుద్ధప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేయాలి' - review
నగరంలో కురుస్తున్న వర్షాలతో రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
'యుద్ధప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేయాలి'
జోన్ల వారీగా...
సికింద్రాబాద్ 467
చార్మినార్ 820
ఖైరతాబాద్ 1,160
శేరిలింగంపల్లి 260
కూకట్పల్లి 342
ఎల్బీనగర్ 360
ఇవీ చూడండి: ఐఏఎస్ మద్యం మత్తుకు పాత్రికేయుడు బలి!