హైదరాబాద్‌లో అమలవుతున్న లాక్‌డౌన్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. కూకట్‌పల్లిలో లాక్‌డౌన్ పరిస్థితులను సీపీ సజ్జనార్‌తో కలిసి పర్యవేక్షించారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.
' ఈ-పాసులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు'
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో లాక్‌డౌన్ అమలు తీరును తీరును మహేందర్‌రెడ్డి పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
dgp mahender reddy inspected kukatpally checkpost
అనవసరంగా రోడ్లపైకి ఎవ్వరొచ్చినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. ఈ- పాసులను దుర్వినియోగం చేయకూడదని కోరారు. అత్యవసరముంటేనే బయటికి రావాలని... లేకపోతే వారితో పాటు మిగతావారికి కూడా ముప్పేనన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చేపట్టిన లాక్‌డౌన్‌ను అందరూ బాధ్యతాయుతంగా మెలిగి... కరోనాను కట్టడి చేయటంలో తమవంతు పాత్ర పోషించాలని కోరారు.