ఏపీ జిల్లాల పునర్విభజన అధ్యయన కమిటీలో డీజీపీని సభ్యుడిగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 25 నుంచి 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును కూడా ఓ సభ్యుడిగా పేర్కొంటూ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది.
ఏపీ: కొత్త జిల్లాల అధ్యయన కమిటీలో డీజీపీకి చోటు - ఏపీలో కొత్త జిల్లాలపై రాష్ట్రస్థాయి అధ్యయన కమిటీ
ఏపీలో కొత్త జిల్లాలపై రాష్ట్రస్థాయి అధ్యయన కమిటీని ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కొత్తగా డీజీపీని సభ్యుడిగా చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ కమిటీ జిల్లాల పునర్విభనజనపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తుంది.
కొత్త జిల్లాల అధ్యయన కమిటీలో డీజీపీకి చోటు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే రాష్ట్ర స్థాయి అధ్యయన కమిటీ జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచింది. జిల్లాల్లో పోలీసు యంత్రాంగం విభజన, సర్దుబాట్లు, కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు సంబంధించి డీజీపీ కూడా ప్రతిపాదనలు సమర్పించనున్నారు.
ఇదీ చదవండి :హైదరాబాద్లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్