కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీయాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ప్రజలను కోరింది. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న దళిత , ఆదివాసీ నేతలను, కవులను, కళాకారులను అక్రమ అరెస్ట్‌లతో నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలపై పాశవిక నిర్భంధం ప్రయోగిస్తూ...మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించబడవని...పోరాటం ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కరించబడుతాయని వారు తెలిపారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీయాలి - 2019 telangana electionms
ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికలు దేశంలో చాలా కీలకమైనవని ఆచార్య పీ.ఎల్. విశ్వేశ్వరరావు అన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు నిలదీయాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కోరింది.
ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి