Raghurama Case: ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
14:22 May 28
రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ తీరుపై ఆయన కుమారుడు భరత్ ఫిర్యాదు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును(Raghurama) ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన తీరు, తదనంతర పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)(NHRC) స్పందించింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శిలకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
కస్టడీలో రఘురామపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. రఘురామ అరెస్టు తీరుపై (Raghurama Arrest)ఆయన తనయుడు భరత్ ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది.
ఇవీచూడండి:Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు