దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరుతూ... దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద 51 గంటల దీక్షకు దిగింది. ఉద్యోగాలు రాలేదని తీవ్ర మానసిక వేదనకు గురై నల్గొండకు చెందిన మహేందర్, రాగుల రామ్మోహన్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఉద్యోగం ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షుడు గోలి ప్రభాకర్ కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు దీక్ష శిబిరాన్ని రాత్రికిరాత్రే తొలగించారు. అయినప్పటికీ దీక్ష కొనసాగిస్తున్న ప్రభాకర్ ఆరోగ్యం క్షీణించినందున ఆయనను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు.
దివ్యాంగులకు న్యాయం చేయాలంటూ దీక్ష... భగ్నం - deeksha
ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగుల కుటుంబాలకు న్యాయం చేయాలని తెలంగాణ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి చేపట్టిన దీక్ష భగ్నమైంది. పోలీసులు దీక్షలో వారిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు.
దివ్యాంగులకు న్యాయం చేయాలంటూ దీక్ష
Last Updated : Jun 18, 2019, 10:57 AM IST