ఆంధ్రా-ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగవరం గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈ నెల 21న ఏవోబీ ప్రాంతంలో బంద్కు పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్జెడ్సీ అధికార ప్రతినిధి కైలాసం పేరిట లేఖ, ఆడియో టేప్ విడుదల చేశారు. నిద్రలో ఉన్న మావోయిస్టులపై దారుణంగా కాల్పులు జరిపి హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఓబీలో ఈ నెల 21న బంద్కు మావోల పిలుపు
ఏఓబీ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఈ నెల 12న జరిగిన ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ.. మావోయిస్టులు ఆడియో టేప్ విడుదల చేశారు.
ఏఓబీలో ఈ నెల 21న బంద్కు మావోల పిలుపు
రాత్రి రెండుగంటల సమయంలో ఒడిశా పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. పార్టీ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన పసిపాపను కూడా హతమార్చారని వాపోయారు. ఈ ఘటనను దారుణంగా ఖండిస్తూ ఏవోబీ ప్రాంతమంతటా బంద్ పాటించాలని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టి 150 గొర్రెలు మృతి