శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం దసరా మహోత్సవాలకు ముస్తాబైంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈరోజు ఉదయం 8.30 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ పూజలు చేస్తామని ప్రధాన అర్చకులు తెలిపారు.
దసరా ఉత్సవాలకు ముస్తాబైన శ్రీశైలం.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు - dasara celebrations in srisailam 2020
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం దసరా మహోత్సవాలకు సిద్ధమైంది. ఈ రోజు ఉదయం అంకురార్పణ పూజలు చేయనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది.
దసరా ఉత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం..
సాయంత్రం శ్రీ భ్రమరాంబ దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని పూజారులు తెలిపారు. కొవిడ్ నిబంధనల కారణంగా గ్రామోత్సవం రద్దు చేశామని చెప్పారు. స్వామి అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించి ఆలయ ఉత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు దూరం పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని అర్చకులు, అధికారులు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :యాదాద్రిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం