కరోడ్‌పతి మీరే... రూ.35 లక్షలు మీకే!
సైబర్ మోసం.. నిత్యం ఎన్నో వింటున్నాం. చదువుతున్నాం. జాగ్రత్తలు తప్పనిసరినే హెచ్చరికలూ చూస్తున్నాం. కానీ మోసగాళ్ల వల వేగం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ తమ నైజాన్ని మార్చి మోసగిస్తూనే ఉన్నారు. పాతబస్తీలో ఇటువంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది.
cyber crime in hyderabad
కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ.35 లక్షలు గెలుచుకున్నారంటూ పాతబస్తీలోని బండ్లగూడకు చెందిన ఎండీ అన్వర్‌ను సైబర్ నేరస్థులు మోసం చేశారు. తొలుత రూ.16,500 కడితే, వారం వ్యవధిలో రూ.35 లక్షల నగదు బ్యాంకు ఖాతాలో వేస్తామంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మి విడతల వారీగా రూ.6.94 లక్షలు నిందితుల ఖాతాల్లో జమ చేశాడు. తర్వాత ఫోన్ కలవకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.