తెలంగాణ

telangana

ETV Bharat / city

ధరణి పోర్టల్​ ప్రారంభానికి అధికారులు సంసిద్ధం కావాలి: సీఎస్​ - తహసీల్దార్లతో సీఎస్​ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

ధరణి పోర్టల్​కు సంబంధించి... కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్​లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్​ ధరణిని ప్రారంభించనున్నందున... పూర్తిస్థాయిలో సన్నద్ధత కావాలని ఆదేశించారు.

ధరణి పోర్టల్​ ప్రారంభానికి అధికారులు సంసిద్ధం కావాలి: సీఎస్​
ధరణి పోర్టల్​ ప్రారంభానికి అధికారులు సంసిద్ధం కావాలి: సీఎస్​

By

Published : Oct 17, 2020, 4:31 PM IST

పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో భూ లావాదేవీల కోసం విప్లవాత్మకమైన ధరణి పోర్టల్ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు. ధరణి పోర్టల్ పనితీరు, లావాదేవీల నిర్వహణకు సంబంధించి... సీఎస్ వివరించారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న ధరణి పోర్టల్... దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేని విధంగా ధరణి పని చేస్తుందని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. విచక్షణాధికారాలకు ఆస్కారం లేకపోవడం వల్ల సంపూర్ణ పారదర్శకత వస్తుందన్నారు. రాష్ట్రంలోని 570 తహశీల్దార్లు సంయుక్త సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని... 142 కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తారని తెలిపారు. ధరణి అమలుకు తహసీల్దార్లు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు.

ధరణి పోర్టల్​కు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు సమకూర్చాలని, ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు జారీ చేశారు. రేపటిలోగా తహసీల్దార్లు ప్రయోగాత్మకంగా కనీసం పది రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. ధరణి కోసం పూర్తి స్థాయి హార్డ్‌వేర్ సదుపాయాలు కల్పించాలని, సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా డిస్కం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు, టీఎస్‌టీఎస్ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

ఇదీ చూడండి:ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details