Loan Recovery: ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో.. బాకీ వసూలు కోసం(loan apps) ఇంటికి వచ్చిన బ్యాంకు రికవరీ ఏజెంట్లు తమ కుటుంబాన్ని తూలనాడటంతో ఇంటర్మీడియెట్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనం కలిగించింది. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రుణం తీసుకునే వారు, చెల్లించాల్సిన బాధ్యతను మరువకూడదనే బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ‘రుణమొత్తాన్ని ఖాతాదార్ల(credit recovery) నుంచి వసూలు చేసుకోవాల్సిన రికవరీ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే, వారే ఇబ్బంది పడాల్సి వస్తుంద’ని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి వెల్లడించారు. ‘బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు’ నిబంధనావళిని 2006లో ఇండియన్ బ్యాంక్స్(bank loans) అసోసియేషన్ (ఐబీఏ), రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), సభ్య బ్యాంకులతో ఏర్పాటైన స్వతంత్ర సంస్థ ది బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) రూపొందించింది. అయితే బీసీఎస్‌బీఐ లేవనెత్తిన(bank officers) అంశాలన్నీ పర్యవేక్షించే అధికారం/బాధ్యత తనకు ఉన్నందున, ఆ సంస్థను రద్దు చేయాలని ఆర్‌బీఐ 2021లో సూచించింది. అందువల్ల ప్రస్తుతం ఖాతాదారులు తమ ఇబ్బందులపై బ్యాంకు శాఖ లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌నే సంప్రదించాలి.
బీసీఎస్‌బీఐ రూపొందించిన నిబంధనావళి ఇలా..
రుణ రికవరీ ప్రక్రియను ఎప్పుడు చేపడుతున్నామన్న(bank rules) విషయాన్ని బ్యాంకు/ఆర్థిక సంస్థ సంబంధిత ఖాతాదారుకు తెలియజేయాలి. రికవరీ ఏజెన్సీ లేదా ఏజెంట్ పేరును బ్యాంకులు తప్పనిసరిగా తమ రుణ గ్రహీతకు వెల్లడించాలి.
*రుణ గ్రహీతలను ఏజెన్సీ ప్రతినిధులు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల మధ్యే సంప్రదించాలి. సమాచారం ఇవ్వకుండా ఖాతాదారుల వద్దకు వారు వెళ్లకూడదు. అంగీకరిస్తే ఉదయం 9- సాయంత్రం 6 గంటల మధ్యే వెళ్లాలి.
*రికవరీ ఏజెంట్ కలవాలనుకుంటే, ఎక్కడ అనేది ఖాతాదారే నిర్ణయించాలి. అతను/ ఆమె గోప్యతను ఏజెంట్ గౌరవించాలి. వారిని అల్లరి చేసేలా కాకుండా, మర్యాద పూర్వకంగానే వ్యవహరించాలి. ఈ సమావేశం కోసం బ్యాంకు నుంచి అధీకృత లేఖను సదరు ఏజెంట్ తీసుకెళ్లాలి.
*రుణ గ్రహీతను ఫోన్/చిరునామాలో సంప్రదించడం వీలుకాకపోతే, అప్పుడు మాత్రమే అతని/ఆమె స్నేహితులు, బంధువులు, సన్నిహితులను ఏజెంట్ కలవవచ్చు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా, రుణ గ్రహీత తప్పనిసరిగా తన ఫోన్‌నెంబరు/చిరునామా వంటి వివరాలను రుణదాతకు అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
ఆర్‌బీఐ ప్రకారమూ..ఒకవేళ రుణగ్రహీత కనుక రుణానికి సంబంధించి(rbi rules) ఏదైనా సమస్యను లేవనెత్తితే, అది పరిష్కరించే వరకు బ్యాంకు సంబంధిత రుణ ఖాతాను రికవరీ ఏజెన్సీలకు బదిలీ చేయకూడదు. బ్యాంకు కనుక 30 రోజుల్లోపు ఆ సమస్యను పరిష్కరించలేకపోతే, సంబంధిత రుణ గ్రహీత బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, వడ్డీ వ్యాపారులు, ఆస్తుల పునర్నిర్మాణ సంస్థలు ఈ మార్గదర్శకాలను పాటించాలి.