తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ హైకోర్టు స్టేటస్​కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్​పై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు.

amaravathi
amaravathi

By

Published : Aug 13, 2020, 10:14 PM IST

ఏపీ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించనుంది. ఈ చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. రాజధాని పిటిషన్‌లో అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు.

కేవియట్ వేసిన వారికి పిటిషన్ కాపీ పంపినట్లు గతంలోనే కోర్టుకు ప్రభుత్వం చెప్పింది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఇళ్ల స్థలాలు, ఆర్-5 జోన్ ఏర్పాటుపై హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాలు చేసింది.

ఇదీ చదవండి :అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ABOUT THE AUTHOR

...view details