CPM leaders will meet with KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ప్రగతి భవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసకు సీపీఎం మద్దతు ప్రకటించిన తర్వాత తొలిసారి సీఎంతో సమావేశం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తాజా రాజకీయాలపైన చర్చిస్తున్నారు.
భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి, ఈ ఎన్నికలో తమ మద్దతు తెరాస పార్టీకే ఉంటుందని మునుగోడు సభకు ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ ఒక్క ఎన్నికలో మాత్రమే తెరాస పార్టీకి మద్దతు ఇస్తామని సమావేశంలో తెలిపారు. దీంతో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.