CPI State Secretary Kunamneni letter to PM: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని.. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు పార్లమెంట్ సాక్షిగా చేసిన హామీని నెరవేర్చాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చేసిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటే.. ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన బాటపట్టడం మినహా వేరే మార్గం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కూనంనేని ప్రధానికి లేఖ రాశారు.
ఆ విషయంలో ప్రధాని మోదీకి కూనంనేని లేఖ.. ఆందోళన చేస్తామంటూ.. - bayyaram steel plant
CPI State Secretary Kunamneni letter to PM: బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన అవిభక్త ఖమ్మం జిల్లా ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని కూనంనేని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి చేసిన ప్రకటన ఎంతో నిరాశ పరిచిందన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ భాజపా పూర్తిస్థాయి మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014ను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, సంబంధిత స్టేట్ హోల్డర్స్‌తో కానీ ఎలాంటి చర్చలు జరపకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే తప్ప మరొకటి కాదని ఆ లేఖలో వివరించారు.
ఇవీ చదవండి: