దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. శ్రమ శక్తిని దోపిడీ చేసే భూస్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆవిర్భవించిందే ఏఐటీయూసీ అని వివరించారు. మనుషుల రక్తం నుంచి వచ్చిన ఎర్రజెండా... దేశంలో మొట్టమొదటి సారిగా కార్మికులను ఏకం చేసిందని తెలిపారు.
ప్రభుత్వాలే మారుతున్నాయి.. కార్మికుల బతుకులు కాదు: చాడ - ఏఐటీయూసీ శతాబ్ధి ఉత్సవాలు
పాలకులు మారుతున్నారు తప్ప... కార్మికుల బతుకులు మారడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఏఐటీయూసీ శతాబ్ధి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన చాడ.. దేశంలో మొట్టమొదటి సారిగా కార్మికులను ఎర్రజెండా ఏకం చేసిందని వ్యాఖ్యానించారు.
పాలకులు మారుతున్నారు తప్ప... కార్మికుల బతుకులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాల పేరుతో కాలరాస్తున్నాయని ఆరోపించారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో కార్మికుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:దిల్లీలో ఇంకా తీవ్ర స్థాయిలోనే గాలి నాణ్యత
TAGGED:
ఏఐటీయూసీ శతాబ్ధి ఉత్సవాలు