దిల్లీ అగ్నిగుండం కావడానికి శాంతిభద్రతల సమస్య కారణం కాదని.. ఆర్ఎస్ఎస్తో కలిసి భాజపా.. అల్లర్లు సృష్టించి అధికారంలోకి రావాలని యత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అల్లర్లకు కారణమైన ముగ్గురు భాజపా నాయకులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన.. నారాయణ దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మురళీధరన్‌ను బదిలీ చేయించారన్నారు.
'భాజపా అనైతిక రాజకీయ క్రీడ ఆడుతోంది'
దిల్లీ పరిస్థితులపై భాజపా ఆడుతున్నది అనైతిక రాజకీయ క్రీడగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభివర్ణించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడైన కన్హయ్య కుమార్‌పై కేంద్ర ప్రభుత్వం దేశద్రోహం కింద తప్పుడు కేసు పెట్టిందని మండిపడ్డారు.
'భాజపా అనైతిక రాజకీయ క్రీడ ఆడుతోంది'
కన్హయ్యపై ఉన్న కేసులను బయటికితోడి అరెస్టు చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాకోర్టులో తాను నిర్దోషినని కన్హయ్య కుమార్ నిరూపించుకున్నాడని.. న్యాయ స్థానాల్లోనూ అదే జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని నారాయణ తెలిపారు.
ఇవీచూడండి: దిల్లీ అల్లర్లపై మోదీ ఎందుకు మాట్లాడరు?: అసదుద్దీన్