తెలంగాణ

telangana

ETV Bharat / city

'పరిస్థితి దయనీయంగా ఉంది.. ప్రభుత్వం ఇకనైనా నిద్రలేవాలి' - ప్రభుత్వానికి చాడ హెచ్చరిక

హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని ప్రేమిలాథాయ్‌ నగర్‌ బస్తీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం పర్యటించారు. కరోనా నివారణ చర్యలు, ప్రభుత్వ సహాయంపై బస్తీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక.. కొంత మంది ఇబ్బంది పడుతున్నారని కోదండరాం అన్నారు. కుటుంబానికి రూ.7 వేలిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి చావులే: చాడ
ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి చావులే: చాడ

By

Published : Jul 6, 2020, 1:35 PM IST

కరోనా పరిస్థితుల నుంచి ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. అఖిలపక్ష నేతలను కేసీఆర్ ఆహ్వానిస్తే అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తెద్దామన్నారు. ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోకపోతే ఆకలి చావులు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్​లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయంతో బతుకుతున్నారని తెలిపారు. హైదరాబాద్​లో కరోనా పరీక్షలను ఇంకా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంటు బిల్లులు కూడా ప్రజలపై పెద్ద ఎత్తున మోపుతున్నారని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకుంటే అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

మనిషిని కాపాడటమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం..

లాక్​డౌన్​ ఎత్తివేయగానే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి లేక ప్రజలు చస్తూ బతుకుతున్నారు. కారం మెతుకులు తిని బతుకుతున్నామని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ చికిత్స అందరికీ అందుబాటులో ఉంచాలి. 12 కిలోల బియ్యం పప్పు, నూనె ఉచితంగా ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి రూ.7,000 నగదు ఇవ్వాలి. మనిషిని కాపాడటమే ప్రభుత్వ ముందున్న లక్ష్యం. ప్రతి బస్తీలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటాం. - కోదండరాం, తెజస అధ్యక్షుడు

ప్రేమిలాథాయ్‌ నగర్‌ బస్తీలో నేతల పర్యటన

ABOUT THE AUTHOR

...view details