ఏపీలో గత 24 గంటల్లో 83,690 నమూనాలు పరీక్షించగా 8,976 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి 90 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఫలితంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,466 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 13,568 మంది కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,23,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Ap corona cases: కొత్తగా 8,976 కరోనా కేసులు, 90 మరణాలు - corona news
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 83,690 మంది నమూనాలు పరీక్షించగా 8,976 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే కరోనాతో 90 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
కొత్తగా 8,976 కరోనా కేసులు, 90 మరణాలు
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,669, చిత్తూరులో 1,232, అనంతపురంలో 995, కృష్ణాలో 726 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లాలో 12, పశ్చిమగోదావరిలో 9, అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంలో 8 మంది చొప్పున మృతి చెందారు.
ఇదీచదవండి: 'వ్యవసాయంపై కొవిడ్ 2.0 ప్రభావం ఉండదు'