ఏపీలోని కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో విషాదకర ఘటన జరిగింది. గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. చెన్నూరులోని బ్రాహ్మణవీధికి చెందిన శ్రీరాములు రాజు, సుబ్బలక్ష్మమ్మ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారందరినీ ప్రయోజకులను చేశారు. అందరూ సంతోషంగా ఒకే ఇంట్లో జీవిస్తున్నారు.
భార్య మరణ వార్త విని భర్త మృతి.. మరణంలోనూ వీడని బంధం.. - మృత్యువులోనూ వీడని భార్యాభర్తల బంధం
వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట అయిదు దశాబ్దాలు కలసి సంతోషంగా జీవించింది. చివరికి మరణంలోను ఒకరికి తోడుగా ఒకరు వెళ్లారు. భార్య అనారోగ్యంగా మృతి చెందగా... విషయం తెలిసి భర్త ప్రాణాలు విడిచాడు.
ఇటీవల సుబ్బలక్ష్మమ్మకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేశారు. శ్రీరాములరాజు సైతం అప్పుడే అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం సుబ్బలక్ష్మమ్మ మళ్లీ అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఇంటి వద్దనే వైద్యం అందజేశారు. బుధవారం రాత్రి పరిస్థితి విషమించటంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బలక్ష్మమ్మ మృతి చెందింది. భార్య మరణ వార్త వినగానే శ్రీరాములు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. భార్యాభర్తల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.