తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లో నిలిచిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ!

ఆంధ్రప్రదేశ్​లో వ్యాక్సినేషన్​కు సమస్య ఏర్పడింది. రద్దీకి తగ్గట్లుగా టీకాలు లేకపోవడంతో.. వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. అధికారులు రెండో డోసు వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

ap
ap

By

Published : May 10, 2021, 12:46 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. 3.5 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉండగా.. రెండో డోసు వారికే టీకా వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి అనుగుణంగా కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పులపై అధికారులు కసరత్తు చేపట్టారు.

వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు కూడా ప్రయత్నం మొదలుపెట్టారు. ఎవరికి, ఎప్పుడు టీకా ఇస్తారనే వివరాలతో ఇంటివద్దకే స్లిప్పుల పంపిణీ చేయనున్నారు. టోకెన్ల పంపిణీ పూర్తయ్యాకే కరోనా వ్యాక్సినేషన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details