రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 503కు చేరింది. ఇప్పటి వరకు 96 మంది కొలుకొని ఇళ్లకు వెళ్లారు. వైరస్‌తో శనివారం మరో ఇద్దరు చనిపోవడం ఫలితంగా మృతుల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 393 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం ఎవరూ ఆస్పత్రుల్లో, ప్రభుత్వ పర్యవేక్షణలో లేరని ముఖ్యమంత్రి ప్రకటించారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయని ప్రస్తుతం 1654 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. కొత్త కేసుల సంఖ్య తగ్గిందన్నారు.
కంటైన్మెంట్ జోన్లు..
కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్ని కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి.. అవసరమైన చర్యలు చేపట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలకు నిత్యవసరాలను ఇంటి వద్దకే సరఫరా చేస్తామన్నారు.