కరోనా వైరస్ ప్రజలకు తీవ్ర కష్టాలు తెచ్చిపెడుతోంది. కనీసం కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసేందుకు కూడా వెళ్లలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి.. గత శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకోగా... అతనికి వైరస్ సోకినట్టు తేలింది. అదే రోజు ఆ వ్యక్తిని కడప ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. పదిరోజుల కిందటే ఆయన సోదరి గుండెపోటుతో మరణించింది. కుమార్తె మరణం, కుమారుడికి కరోనా సోకడం వల్ల ఆ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
కష్టాలే కాదు.. కన్నీళ్లూ పెట్టిస్తున్న కరోనా.. కన్నవారినైనా చూసుకోనివ్వదా?
కరోనా వైరస్... ప్రజలకు తీవ్ర కష్టాలు తెచ్చి పెడుతోంది. కనీసం కన్నవారి మృతదేహాలను చూసేందుకు కూడా వెళ్లలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనే ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఒకేే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
కష్టాలే కాదు.. కన్నీళ్లూ పెట్టిస్తున్న కరోనా.. కన్నవారినైనా చూసుకోనివ్వదా?
ఆ బాధితుడు ఆసుపత్రికి వెళ్లగా... దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తల్లి కూడా మంచం పట్టింది. కూతురు మరణించిందనే దిగులు ఓ వైపు... కుమారుడికి కరోనా సోకిందనే విషయం మరోవైపు ఆ వృద్దురాలి ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీసింది. ఈ కారణంగా.. ఆమెను కుటుంబసభ్యులు కడప రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ వృద్దురాలు కూడా మరణించింది. పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు కుటుంబ సభ్యులు మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇవీ చూడండి: కరోనా దెబ్బ.. తలకోన పర్యాటకం కుదేలు