హైదరాబాద్‌లోని ఏజీఐ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్(ap governor health condition) కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కొవిడ్ నెగెటివ్ నిర్ధారణ అయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని ఏఐజీ ఆసుపత్రికి చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం శనివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో తెలిపారు.
ap governor health condition: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్కు కరోనా నెగెటివ్ - తెలంగాణ వార్తలు
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్(ap governor health condition)కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కొవిడ్ నెగెటివ్ నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో ఈనెల 17న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆ రాష్ట్ర గవర్నర్.. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(ap governor Bishwa bhushan corona news) ఇటీవలె అస్వస్థతకు గురయ్యారు. దిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన.. గత రెండు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతూ పరీక్షలు చేయించుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీపీసీఆర్ పరీక్ష(rt pcr test) చేయించగా... స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్కి ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స అందించారు. ఏపీ గవర్నర్ ఆరోగ్యం బాగుండాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana governor tamilisai) కూడా ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ త్వరగా కోలుకోవాలని ఆమె కోరారు. బిశ్వభూషణ్ త్వరగా కోలుకుని దేశానికి సేవచేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:Telangana TDP: నేడు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా మౌనప్రదర్శనలు, దీక్షలు