లేచింది మొదలు హడావుడి.. పిల్లల్ని ఉదయమే బడికి పంపించడం.. ఉరుకులు పరుగులతో ఉద్యోగాలకు...వారాంతం వస్తే సినిమాలు, షాపింగ్‌లు, హోటల్ భోజనాలు.. అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్లు.. జల్సాలు.. విందూ వినోదాలు.. ఇదీ కరోనా ముందు పలు కుటుంబాల జీవనశైలి. మహమ్మారి రాకతో పరిస్థితి తలకిందులైంది. అంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఆహారపు అలవాట్లు, అభిరుచులు మారాయి. ఆరోగ్య జాగ్రత్తలు పెరిగాయి. అదే సమయంలో నెలవారీ ఖర్చులు తారుమారవుతున్నాయి. ఇంటి బడ్జెట్ పెరుగుతోందని సగటు జీవి ఆవేదన చెందుతున్నాడు. ఏ రోజుకారోజు కష్టించి బతుకుబండి లాగేవారిని మాత్రం కరోనా కాటేస్తోంది. రూపాయి ఆదాయం లేకపోగా పెరిగిన ఖర్చులతో అప్పులపాలవుతున్నట్లు బడుగు జీవి ఆందోళన చెందుతున్నాడు. బయటి ఖర్చులు తగ్గాయని ఆర్థికంగా బాగున్నవారు చెబుతున్నారు.
పెరుగుతున్న ధరలు
కరోనా దెబ్బతో నూనెలు, చింతపండు, బియ్యం, చికెన్, మటన్ ధరలు పెరుగుతూ ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ‘రోజంతా ఇంట్లో ఉండటం వల్ల ఏసీ, ఫ్యాన్లు, టీవీ వాడకం పెరిగింది. టీ, కాఫీ ఎక్కువసార్లు తాగడం వల్ల అర లీటరు పాల వినియోగం అధికమైంది. 30 రోజులొచ్చే గ్యాస్ సిలిండర్ 24 రోజులకే అయిపోయింది. శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌వాష్ లిక్విడ్లకు రూ.వెయ్యి ఖర్చయింది’ అని చంపాపేటకు చెందిన గృహిణి మాధవి చెబుతున్నారు. బంధువుల ఇళ్లకు వెళ్లడం, వాహనాల్లో తిరిగే ఖర్చులు తగ్గినా..ఇంటి ఖర్చు కొంత పెరిగిందని.. రిటైర్డ్ ఉద్యోగి వై.రత్నం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనాకు ముందు సగటున రోజుకు 1,700-1,800 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండేది. లాక్‌డౌన్‌తో అంతా ఇంట్లో ఉండటం వల్ల విద్యుత్తు వాడకం 2,600 మెగావాట్లకు పెరిగింది.
పెరిగిన గ్యాస్ బుకింగ్‌లు
అయిపోయిన వెంటనే దొరకవేమోనన్న కారణంతో వెంటవెంటనే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇంట్లో వంటలు కూడా పెరిగాయి. దీంతో సిలిండర్ల బుకింగ్‌లు, వాటితో పాటు ఖర్చులూ పెరిగాయి.
గతంలో: 1.30 లక్షలు