శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలనే సామెత రాచకొండ కమిషనరేట్ అధికారులకు సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వ తీసుకుంటోన్న ప్రతి నిర్ణయానికి పోలీసు శాఖ సాయం తప్పనిసరి. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన తరుణంలో పోలీసులు ఎక్కడిక్కడ ప్రజలు బయటకు రాకుండా నిలువరిస్తున్నారు. అయితే కరోనా భయం పోలీసు శాఖలో కూడా ఉంది.
పోలీసులు కరోనా రాకుండా ఏం చేస్తున్నారో తెలుసా?
కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. లిఫ్ట్ బటన్‌ను ఎవరు నేరుగా తాకకుండా ఉండేందుకు టూత్ స్టిక్స్‌ను ఏర్పాటు చేశారు.
'శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు'
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ఆస్కారం ఉన్నందున చేతులు ఎక్కడా తాకకుండా వినూత్నంగా ఆలోచించారు. రాచకొండ పోలీస్ కార్యాలయంలో లిఫ్ట్‌కు టూత్ స్టిక్స్‌ను ఏర్పాటు చేశారు. ఎవరూ లిఫ్ట్ బటన్‌ను నేరుగా ముట్టుకోవద్దని, ప్రతిఒక్కరు వాటిని స్టిక్స్‌తో మాత్రమే టచ్ చెయ్యాలని సూచించారు.
ఇవీ చూడండి:మనం ఇంట్లో ఉండటమే వారికిచ్చే గిఫ్ట్