ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 1,01,863 మందికి పరీక్షలు చేయగా.. 8,239 మందికి వైరస్ సోకింది. మహమ్మారికి మరో 61 మంది మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 11,135 మంది కోలుకోగా.. ప్రస్తుతం 96,100 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలవారీగా కరోనా మరణాలు..
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10మంది చనిపోయారు. పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. విశాఖలో ఆరుగురు మృతి చెందగా... అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు.