ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్ ఉద్ధృతి ఆగడంలేదు. శనివారం దాదాపు 20వేల కొత్త కేసులు, 100కి పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 90,609 శాంపిల్స్ పరీక్షించగా.. 19,981 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.85కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించగా..15,62,060 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.వీరిలో 13,41,355 మంది కోలుకోగా.. 10,022 మంది మరణించారు.ప్రస్తుతం 2,10,683 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఏపీలో కరోనా విలయం... 10వేలు దాటేసిన మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి ఉద్ధృతి ఆగడంలేదు. కరోనా కేసులు ఏమాత్రం తగ్గటం లేదు. తాజాగా 20వేల కొత్త కేసులు, 100కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 10వేల మార్కును దాటేసింది.
corona cases in andhra pradesh today
10వేలు మార్కు దాటేసిన మరణాలు
ఏపీలో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 10వేల మార్కును దాటేసింది. శనివారం ఒక్కరోజే 118 మరణాలు నమోదు కావడంతో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 10,022కి పెరిగింది. శనివారం నమోదైన మరనాల్లో పశ్చిమగోదావరిలో అత్యధికంగా 15 మంది ప్రాణాఆలు కోల్పోగా.. చిత్తూరులో 14, తూర్పుగోదావరి 11, విశాఖ 11, గుంటూరు 10, అనంతపురం 9, కృష్ణా 9, శ్రీకాకుళం 8, విజయనగరం 8, కర్నూలు 7, నెల్లూరు 7, ప్రకాశం 7, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు.