తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజధానిలో కరోనా కేసుల తగ్గుముఖం... నగరవాసుల్లో ఆనందం - telangana corona cases

మొదట్లో రాజధానిలో కోరలు చాచిన కరోనా మహమ్మారి... ఇప్పుడు క్రమంగా బలహీనపడుతోంది. గతంలో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సింహభాగం నగరానిదే కాగా... ఇప్పుడు ఆ సంఖ్య అంతకంతకూ తగ్గుతూ పోతోంది. పరీక్షలకు వచ్చిన వారిలో 20-30 శాతం కొవిడ్‌ పాజిటివ్‌గా తేలేవారు... ఇప్పుడు మాత్రం 50 మందికి పరీక్షలు చేస్తే.. ఇద్దరు ముగ్గురిలో మాత్రమే వైరస్‌ కన్పిస్తోంది. దీనికి వివిధ అంశాలు కారణమంటున్నారు వైద్య నిపుణులు.

corona cases decreasing in hyderabad
corona cases decreasing in hyderabad

By

Published : Sep 24, 2020, 9:11 AM IST

గ్రేటర్‌లో కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. ఆగస్టులో రోజూ ఆరేడు వందలుగా నమోదైన కేసుల సంఖ్య.. తాజాగా 300-400 మధ్యే ఉంటోంది. ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో కొన్ని కేంద్రాల్లో పరీక్షలకు వచ్చిన వారిలో 20-30 శాతం కొవిడ్‌ పాజిటివ్‌గా తేలేవారు. క్రమేపీ ఈ శాతం తగ్గుతోంది. కొన్నిచోట్ల 50 మందికి పరీక్షలు చేస్తే.. ఇద్దరు ముగ్గురిలో మాత్రమే వైరస్‌ కన్పిస్తోంది. కరోనా కేసులు ప్రారంభమైన మొదట్లో, మలక్‌పేట పరిధిలోని అర్బన్‌ కేంద్రాల్లో భారీగా నమోదైన కేసులు, కొన్ని రోజులుగా చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతుండడం విశేషం. మరికొన్ని పీహెచ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది.

ఈనెల 10-21వ తేదీల మధ్య పరీక్షలు, ఫలితాలు ఇలా..

గ్రేటర్‌లో మాత్రమే రోజువారీ పాజిటివ్‌ కేసులు సుమారు:250-320

గ్రేటర్‌లో మాత్రమే బయట పడిన కేసుల సంఖ్య:3,710

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పరీక్షల సంఖ్య:15-16వేలు

మూడు జిల్లాల్లో రోజువారీ నమోదైన పాజిటివ్‌ కేసులు:500-600

వైద్యుల అంచనా మేరకు తగ్గుదలకు దోహదపడుతున్న అంశాలు

గతంలో కరోనాను గుర్తించాలంటే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేసేవారు. ఇందులో దాదాపు 70-80 శాతం కచ్చితత్వం ఉంటుందని అంచనా. కొన్ని రోజులుగా అన్ని యూపీహెచ్‌సీలు(పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలే చేస్తున్నారు. ఈ ఫలితాల కచ్చితత్వం 50 శాతమే. ఒకవేళ లక్షణాలుండి కరోనా నెగిటివ్‌ వస్తే...మళ్లీ ఆర్టీ-పీసీఆర్‌ తప్పనిసరి. పూర్తిగా యాంటిజెన్‌ ఫలితాలపైనే ఆధారపడలేం.

నగరంలో 6 లక్షల మందికి కరోనా వచ్చిపోయినట్లు సీసీఎంబీ అంచనా వేసింది. మురుగునీటి నమూనాల ద్వారా ఈ సంఖ్యను గుర్తించింది. దీన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో సామూహిక వ్యాధి నిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ) వచ్చి ఉండే అవకాశాలున్నాయి. ఇలాంటివారికి పరీక్షలు చేసినా ఫలితం నెగిటివ్‌ రావచ్ఛు

మరికొన్ని ఆరోగ్య కేంద్రాల్లో తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు. కేసులూ తక్కువ సంఖ్యలో బయట పడుతున్నాయి.

చాలామంది ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో యాంటీబాడీ పరీక్షలు చేయించుకుంటున్నారు. కొందరిలో ఇప్పటికే యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు గుర్తించాం. ఇలాంటి వారికి పరీక్షలు చేసినా నెగిటివ్‌ వస్తోంది. అంటే వీరిలో కరోనా వచ్చి తగ్గినట్లే. ఉదాహరణకు ఒక ఇంట్లో ఒకరికి కరోనా నిర్ధారణ అయినా.. మిగతా సభ్యులకు నెగిటివ్‌ వస్తోంది. కొందరిలో వైరస్‌ సోకకపోవడం ఒక కారణమైతే.. అప్పటికే మిగతా వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందడం మరో కారణం.

అజాగ్రత్త పనికిరాదు

-డాక్టర్‌ శ్రీహర్ష, సర్వైలెన్స్‌ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల శాతంలో గతంతో పోల్చితే తగ్గుదల కనిపిస్తోంది. అయినా ఇప్పటికిప్పుడు ఒక అంచనాకు రావడం కష్టం. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కదా అని... అజాగ్రత్త వహించొద్ధు కొందరిని వైరస్‌ చాలా ఇబ్బంది పెడుతోంది. ఇంట్లో పెద్దలు ఉండేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

పీహెచ్‌సీలలో యాంటీజెన్‌ పరీక్షలు(22.8.2020 నాటివి)


ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,176 కరోనా కేసులు, 8 మరణాలు

ABOUT THE AUTHOR

...view details