తెలంగాణపై కొవిడ్ పంజా.. 39,154 యాక్టివ్ కేసులు - corvid deaths in telangana
09:27 April 19
రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ
తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో మరో 4,009 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి మరో 14 మంది మృతి చెందారు. గత 15 రోజుల్లోనే వైరస్ బారినపడి 121 మంది మరణించారు. మరో 1,878 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో కొవిడ్ క్రియాశీలక కేసులు 39వేలు దాటాయి. ప్రస్తుతం 39,154 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 705 మంది కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఆదివారం రోజున 83,089 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా- 488, రంగారెడ్డి జిల్లా-407, నిజామాబాద్ జిల్లా-367, సంగారెడ్డి జిల్లా-232, కామారెడ్డి జిల్లా-232, జగిత్యాల జిల్లా-223, వరంగల్ అర్బన్ జిల్లా-175, మహబూబ్నగర్ జిల్లా-168 మంది కరోనా బారినపడ్డారు.
- ఇదీ చదవండి :దేశంలో 2 లక్షల 73 వేల కేసులు- 1,619 మరణాలు