తెలంగాణ

telangana

ETV Bharat / city

సత్ఫలితాలిస్తున్న దిగ్బంధ వ్యూహం.. - containment zones news

గ్రేటర్‌లో వ్యాధిని నిలువరించే వ్యూహం సత్ఫలితాలిస్తోంది. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో పాటించిన దిగ్బంధ మంత్రం ఫలించింది. పాజిటివ్‌ కేసుల సంఖ్యను అధికారులు కట్టడి చేయగలిగారు. అందులో భాగంగా పరిస్థితి అదుపులోకి వచ్చిన 45 ప్రాంతాలను ప్రభుత్వం శుక్రవారం కంటైన్‌మెంట్‌‌ జోన్ల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారులు ఆ మేరకు ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేశారు. అయినప్పటికీ వారంతా రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ నిబంధనను పాటించాల్సిందేనని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

containment zones lift in Hyderabad
సత్ఫలితాలిస్తున్న దిగ్బంధ వ్యూహం..

By

Published : Apr 25, 2020, 6:08 AM IST

ఏప్రిల్‌ 8న సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు నమోదైన ఇల్లు కేంద్రంగా చుట్టూ మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలా ఏప్రిల్‌ 10వరకు 126 జోన్లు ఏర్పడ్డాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి సరకులు పంపిణీ చేశారు. పోలీసులు గృహస్థులను గడప దాటి బయటకు రాకుండా బందోబస్తు నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించింది. శుక్రవారంతో రెండు వారాలు గడిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమీక్ష చేసింది.

ఇవీ కారణాలు..

కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఒకటి నుంచి రెండు పాజిటివ్‌ కేసులు మాత్రం నమోదవడం. దిల్లీ మర్కజ్‌లో మార్చి నెలలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వ్యక్తులు లేదా విదేశాల నుంచి వచ్చినోళ్లు ఒక్కరే ఉండటం. కొవిడ్‌ బాధితులు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అవడం, స్థానికుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్కారు కంటైన్‌మెంట్‌ జోన్లను రద్దు చేసింది. రద్దయిన వాటిలో కేవలం దోమలగూడ, బేగంపేట జోన్లు మాత్రమే మూడు పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలు. మిగిలినవన్నీ ఒకటి, రెండు కేసులు నమోదైనవి.

శుక్రవారం రెండు కేసులు!

గ్రేటర్‌లో శుక్రవారం కేవలం రెండే రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గ్రామీణ రంగారెడ్డిలో మరో కేసును గుర్తించారు. కొన్ని రోజులుగా గాంధీ, ఛాతీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 37 మంది కోలుకోవడంతో ఇళ్లుకు పంపారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు అనుమానిత లక్షణాలతో నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారు. ఇందులో నెలల పాప కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • కాప్రా సర్కిల్‌ పరిధిలో రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. సర్కిల్‌ పరిధిలో ఉంటున్న ఓ కాపలాదారు(45)కు, హెచ్‌బీకాలనీ డివిజన్‌కు చెందిన వ్యక్తి (46)కి కరోనా పాజివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
  • యాచారం మండలం నందివనపర్తికి చెందిన యువకుడు గురువారం మృతి చెందాడు. గ్రామస్థులు అనుమానించగా వైద్యులు నమూనాలు సేకరించి పరీక్షకుపంపారు. మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. నల్లవెల్లికి చెందిన డ్రైవర్‌ చెన్నై నుంచి వచ్చి, కరోనా భయంతో పరీక్ష చేయించుకున్నాడు. అధికారులు అతన్ని విచారించారు.

రద్దయిన కంటెయిన్‌మెంట్‌ జోన్ల పరిధిలో నమోదైన పాజిటివ్‌ కేసులు ఇలా..

మర్కజ్‌ ప్రయాణికులు, వీళ్ల సన్నిహితులు : 43

విదేశీ ప్రయాణికులు, వీరి ప్రైమరీ కాంటాక్టులు: 18

రద్దయిన కంటెయిన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని ప్రాంతాలు

ABOUT THE AUTHOR

...view details