సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్టేషన్ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. లాల్బజార్లో నూతన భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న పాత బిల్డింగ్ గోడ పడిపోవడంతో ఆంజనేయులు అనే కార్మికుడు ప్రమాదానికి గురయ్యాడు.
పాత గోడల మధ్య ఇరక్కుపోయి కార్మికుడికి గాయాలు - సికింద్రాబాద్‌లో భవన నిర్మాణంలో ప్రమాదం
సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లాల్బజార్లో ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఆంజనేయులు... ప్రమాదవశాత్తు పాత గోడల మధ్య ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
పాత గోడల మధ్య ఇరుక్కుపోయి భవన నిర్మాణ కార్మికుడికి గాయాలు
ప్రమాదవశాత్తు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు జీహెచ్ఎంసీ డీఆర్‌ఎఫ్ సాయంతో మూడు గంటల పాటు శ్రమించి అతన్ని బయటకు తీశారు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి