Mallu Ravi Comments: కాంగ్రెస్‌లో ఉంటూ భాజపాకు అనుకూలంగా పనిచేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ సీనియర్ నేత మల్లు రవి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ.. శల్యసారథ్యం చేసి పార్టీని చంపాలని చూశారని మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ప్రజలు రాజకీయంగా బొందపెడతారని మల్లు రవి ఘాటువ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ చేసిన ఆరోపణలను సైతం మల్లు రవి తీవ్రంగా ఖండించారు. దాసోజు శ్రవణ్ పార్టీ మారడం తొందరపాటు నిర్ణయంగా పేర్కొన్న మల్లు రవి.. రాబోయే ఎన్నికల్లో భాజపాకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు తొందరపాటు చర్యగా పేర్కొన్నారు.
కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ వ్యాఖ్యల పట్ల సీనియర్ల అసహనం.. - కాంగ్రెస్‌లో కల్లోలం
Mallu Ravi Comments: రాష్ట్ర కాంగ్రెస్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు.. కొంత మంది నాయకులు పార్టీ వీడుతుంటే.. మరికొంత మంది వారిపై ఘాటు కామెంట్లు చేయటం ఇప్పుడు కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. ఇప్పుడు తాజాగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలోని సీనియర్లు తప్పుబడుతున్నారు.
Congress senior leader Mallu Ravi about addanki dayakar comments
"భాజపా, తెరాసతో సామాజిక న్యాయం సాధ్యం కాదు. కేవలం కాంగ్రెస్‌తోనే అధి సాధ్యం. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్‌కు మాత్రమే ప్రధాన పోటీ ఉంటుంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు మేం సిద్దంగా ఉన్నాం. అసెంబ్లీని రద్దు చేయాలా..? వద్దా..? అనేది కేసీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఉపఎన్నికలు వస్తాయని తమ పరిశీలనలో ఉంది." - మల్లు రవి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
ఇవీ చూడండి: