పంచాయతీల్లో ఎన్నికలు జరిగి ఇన్ని రోజులైనా... నిధుల్లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించిందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సర్పంచ్ల వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యూరియా దొరక్క రైతులు అయోమయంలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే... కలెక్టర్లు కాళేశ్వరం సందర్శనలో తిరుగుతున్నారని ఆరోపించారు.
పాలన గాలికొదిలేసి పర్యటనలు చేస్తున్నారు: దుద్దిళ్ల - kcr
పరిపాలానాధికారులు పాలనను గాలికొదిలేసి పర్యటనలు చేయడం సరికాదని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులు అవస్థలు పడుతుంటే... కలెక్టర్లు కాళేశ్వరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు.
పాలన గాలికొదిలి పర్యటనలు చేస్తున్నారు: దుద్ధిళ్ల