Congress Protest: కాంగ్రెస్ నేతల ధర్నాతో గన్‌పార్క్ వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. విద్యుత్ ఛార్జీల పెంపును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నినదించారు. రిక్షాలు తొక్కుతూ వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. అక్కడే మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుల క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Congress Protest: రిక్షా తొక్కుతూ గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా.. - petrol prices hike
Congress Protest: పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నేతల ధర్నాతో హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Congress leaders Protest at gunpark against petrol prices hike
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస.. రెండు ప్రభుత్వాలు తోడు దొంగలేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు ఇష్టారీతిన ధరలు పెంచుతూ.. సామాన్యునిపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:Paddy Procurement: 'ఉగాది తర్వాత కేంద్రంపై ఉద్ధృత పోరాటం'