దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యకక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిశారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై దుష్ప్రచారానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు... దుష్ప్రచారంపై ఫిర్యాదు - సామాజిక మాధ్యమాల అసత్య ప్రచారంపై నేతల ఫిర్యాదు
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిపై వస్తోన్న అసత్య వార్తలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో సోషన్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
డీజీపీని కలిసిన కాంగ్రెస్‌నేతలు... దుష్ప్రచారంపై ఫిర్యాదు
ఇలాంటి అసత్య ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మవద్దని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూమ్ యాప్ ద్వారా సూచించారు. పోలింగ్‌ను ప్రభావితం చేసేందుకే తెరాస, భాజపా వర్గీయులే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిజాయితీపరుడని... తాను ఎమ్మెల్యేగా గెలిస్తే దుబ్బాక అభివృద్ధి బాటలో నడుస్తుందని పేర్కొన్నారు.