కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరోసారి లాక్ డౌన్‌ను ఆగష్టు 3 నుంచి 9 వరకు అమలు చేయనున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ అమలు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నంలో వైరస్ నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో నిర్వహించిన సమావేశానికి రెవెన్యూ, మున్సిపల్, మెడికల్, పోలీస్ అధికారులు హాజరయ్యారు.
మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి లాక్డౌన్ : ఏపీ మంత్రి పేర్ని నాని
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా నియంత్రణపై ఏపీ మంత్రి పేర్నినాని సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
perni nani