రాబోయే మూడేళ్లు పాటు జై జవాన్, జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ ఒక్కటయ్యారని రేవంత్రెడ్డి ఆరోపించారు. సమస్యల మీద మనమే పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఇంటికొకరు చొప్పున యువత బయటకు రావాలని కోరారు.
పార్టీ నేతలు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క సూచనలతో రాజీవ్ రైతు భరోసా యాత్రనుచేసినట్లు రేవంత్రెడ్డి వివరించారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేందుకు పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు.