దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో భాగంగా భారత వాయుసేన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ కోర్సులు పూర్తి చేసిన క్యాడేట్లకు ఆయన ఆఫీసర్ బ్యాడ్జీలను అందజేశారు. మొత్తం 127 మంది ఫ్లైయింగ్ కోర్సు పూర్తిచేయగా అందులో ఐదుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఒకరు ఫైటర్ జెట్ పైలెట్‌గా నిలిచారు. కోర్సు పూర్తి చేసుకున్న వారిని ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా అభినందించారు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు
హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా హాజరై... కోర్సు పూర్తి చేసిన వారికి ఆఫీసర్ బ్యాడ్జీలు అందజేశారు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకలు