దిల్లీలో కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం సందర్శన
10:57 October 11
బీఆర్ఎస్ ప్రకటన తర్వాత.. కేసీఆర్ యూపీ టు దిల్లీ పర్యటన
CM KCR UP and Delhi Tour: భారత్ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి దిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ వారంతం వరకు కేసీఆర్ దిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. పలు పార్టీలతో జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని సమాచారం. దిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం జోద్‌పూర్ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లారు. స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు వెళ్లిన సీఎం.. ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోశ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, తెరాస నేత శ్రవణ్‌కుమార్ ములాయం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి దిల్లీకి చేరుకున్నారు.
ఇవీ చదవండి: