తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR: 'తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం చేశారు' - సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. 'సినారె సారస్వత సదనం' నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని సీఎం కేసీఆర్ చెప్పారు.

CM KCR: 'తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం చేశారు'
CM KCR: 'తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం చేశారు'

By

Published : Jul 28, 2021, 8:33 PM IST

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించిన సినారె... తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని సీఎం అన్నారు. గజల్ వంటి ఉర్దూ సాహితీ సాంప్రదాయానికి గౌరవమిచ్చి, తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తెహజీబ్​కు ప్రతీకగా నిలిపారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

రాజ్యసభ సభ్యునిగా, వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా ఆయన చేసిన సేవలు విలువైనవని కొనియాడారు. కరీంనగర్ బిడ్డగా తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన సినారె... తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవ చిరస్మరణీయమని ముఖ్యమంత్రి తెలిపారు. సి.నారాయణ రెడ్డి సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్​లో 'సినారె సారస్వత సదనం' నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇదీ చదవండి: CM KCR: ఆగస్టు 2న సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details