తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోంది: సీఎం కేసీఆర్​

కేంద్రం రాష్ట్రాలపై కర్రపెత్తనం చేస్తోందని, తమ వైఖరి మార్చుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోంది: సీఎం కేసీఆర్​

By

Published : Sep 15, 2019, 2:19 PM IST

Updated : Sep 15, 2019, 3:10 PM IST

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై కర్ర పెత్తనం చేస్తోందని, తమ వైఖరి మార్చుకోవాలని ప్రధానికి తాను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అప్పులు 21శాతం మేర మాత్రమే ఉన్నాయని, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, జపాన్​ లాంటి దేశాలను తాము అనుసరిస్తున్నామన్నారు. రాష్ట్రం కోసం తెచ్చిన అప్పులతో పెట్టుబడి పెట్టామని తెలిపారు. కాళేశ్వరం మీద పెట్టిన డబ్బులపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో 45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు.

రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోంది: సీఎం కేసీఆర్​
Last Updated : Sep 15, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details