రోజుకు 3 లక్షల మందికి కొవిడ్ టీకాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని అన్నారు. రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలపై కేసీఆర్ సమీక్షిస్తున్నారు. విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం అంతగా లేదని సీఎంకు వైద్యాధికారులు వివరించారు.
CM KCR: ఇకపై వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యం: కేసీఆర్ - సీఎం కేసీఆర్ వార్తలు
21:40 September 12
వ్యవసాయం, వైద్య ఆరోగ్య శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష
ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టీకాల స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లతో సీఎస్ తరచూ సమీక్షలు జరపాలని ఆదేశించారు. టీకా సెంటర్లుగా విద్యాసంస్థలు, రైతువేదికలను వాడుకోవాలని సూచించారు. కొవిడ్ లక్షణాలు కనపడగానే అప్రమత్తమైన వారు త్వరగా కోలుకున్నారని... నిర్లక్ష్యం చేసిన వారే ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయని చెప్పారు.
ఆక్సిజన్ ప్లాంట్లు, పడకల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటివరకు వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చామని... ఇకపై వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. నిమ్స్ పరిధిలో మరో రెండు టవర్లు నిర్మించి వైద్య సేవలు పెంచాలని... ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి :T-HUB: దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీ-హబ్-2: కేటీఆర్