కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ - దిల్లీలో సీఎం కేసీఆర్
18:06 December 11
కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సీఎం కేసీఆర్ దిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీలో.. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు కేసీఆర్ దిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్‌సింగ్ పురి, నరేంద్రసింగ్ తోమర్‌లతో ఆయన సమావేశమయ్యే వీలుంది.
దిల్లీలో తెరాస కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్ పరిశీలించి శంకుస్థాపనపై నిర్ణయం తీసుకోనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాలు, విపక్షాల నేతలతో సీఎం సమావేశవుతారనే అంచనాలున్నాయి.