తెలంగాణ

telangana

ETV Bharat / city

సంక్షేమ పథకాలు ఉచితాలంటూ కేంద్రం అపహాస్యం చేస్తోందన్న కేసీఆర్

kcr on independence day విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న వారి కుట్రలను సమర్ధంగా తిప్పికొట్టేందుకు మేధావులు, యువత సహా అన్నివర్గాలు కదలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్నిరకాలుగా అభివృద్ధిలో దూస్తుకెళ్తున్న రాష్ట్రాన్ని.. ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు సరికాదంటూ ఆక్షేపించారు. దిల్లీలో భాజపా సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రం అప్పులు తెస్తోందంటూ కొందరు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు.

kcr
kcr

By

Published : Aug 15, 2022, 11:00 AM IST

Updated : Aug 15, 2022, 1:26 PM IST

kcr on independence day: రాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా సాగాయి. గోల్కొండకోటలో జరిగిన వేడుకలకు హాజరైన కేసీఆర్‌.. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసిన ముఖ్యమంత్రి ... రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరిస్తూనే, కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికీ చేర్చామని.. రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు.

రాజ్యాంగవేత్తల స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటమే కాకుండా.. రాష్ట్రాల స్వేచ్ఛను కాలరాస్తూ దిల్లీలోని భాజపా సర్కారు నిరకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే.. దేశప్రజలు అన్నిరకాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఎడాపెడా... పన్నుల భారం మోపడం.. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కొర్రీలు పెడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రఅప్పులపై కొందరు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని.... ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చట్టం పరిమితికి లోబడే రాష్ట్రప్రభుత్వం అప్పులు తెస్తోందని పునరుద్ఘాటించారు.

గాంధీజీ ప్రభోధించిన అహింసా మార్గంలో రాష్ట్రం సాధించుకున్నామన్న కేసీఆర్‌.. ఏడేళ్లలోనే దేశానికి దిక్సూచిగా మార్చామని సంతోషం వ్యక్తం చేశారు. అపూర్వవిజయాలను సాధించుకుంటా.. ప్రగతి పథంలో పయనించేలా చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దిమని వివరించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అన్న కేసీఆర్‌... ఆ పోరాట చరిత్ర, ఆదర్శాలు, విలువలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు నిర్వహిస్తునట్లు పునరుద్ఘాటించారు.

సంక్షేమంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ నిలిచిందన్న సీఎం

'మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నాం. వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది. దేశానికి రాష్ట్రం దిక్సూచిగా మారింది. ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోంది. బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ మారింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించాం. గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచాం. గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచాం. 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నాం. దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచింది.'- సీఎం కేసీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Aug 15, 2022, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details