తెలంగాణ

telangana

ETV Bharat / city

Cm Jagan Video Conference: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

Cm Jagan Video Conference: ఉద్యోగులకు మంచి జరగాలనే వారి పదవీ విరమణ వయసు పెంచామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి​ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని.. జూన్‌ 30 నాటికి ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జగన్... పలు కీలక ప్రకటనలు చేశారు.

Cm Jagan
Cm Jagan

By

Published : Feb 2, 2022, 7:38 PM IST

Cm Jagan Video Conference: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. జూన్‌ 30 తేదీ కల్లా ప్రక్రియ పూర్తి కావాలని.. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. మిగిలిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్‌ పరీక్షలు కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా.. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రొబేషన్‌పై నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచాం..

ఉద్యోగులకు మంచి జరగాలనే వారి సర్వీసు పెంచామని సీఎం జగన్ అన్నారు. పీఆర్సీ అమలు సహా ఉద్యోగుల కోసం చేయాల్సినవన్నీ చేశామని తెలిపారు. కొవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని ఈ నియామకాలు చేయాలని నిర్దేశించారు.

జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్స్‌లో ఇలా..

జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్స్‌లో 10 శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించామని, పెన్షనర్లకు 5 శాతం స్థలాలు కేటాయించామని, మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచినందున, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు.

మార్చి నుంచి ఆ సమస్య ఉండొద్దు..

కొవిడ్ వ్యాప్తి చెందకుండా మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలను కొనసాగిస్తూ.. ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చామని.. ఆ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆరోగ్యశాఖలో 39 వేల మందిని నియమిస్తున్నామన్న సీఎం.. ఇప్పటివరకూ 27 వేలమందిని రిక్రూట్‌ చేశామన్నారు. మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా నియమించాలన్నారు. మార్చి 1 నుంచి ఎక్కడా సిబ్బంది కోరత మాట వినిపించకూడదన్న సీఎం.. ఈ విషయంలో కలెక్టర్లను బాధ్యులుగా చేస్తానన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. ముఖ్యంగా 43 సూచికలపై కలెక్టర్లుకు దిశానిర్దేశం చేశారు. దృష్టిసారించాలని చూచించారు.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమలు చేసే పథకాలు ఇవే..

ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలను సీఎం ప్రకటించారు. ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు, ఫిబ్రవరి 15న.. వరదల్లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణంను – ఫిబ్రవరి 22న అందజేత. మార్చి 8న విద్యా దీవెన, మార్చి 22న వసతి దీవెన నగదు జమచేయనున్నట్లు సీఎం వెల్లడించారు.

ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీస్‌ పెంచాం. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటనలు చేశాం. జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకొని ఈ నియామకాలు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వినియోగించుకోవాలి. జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో రిబేటుపై స్థలాలు కేటాయించాం. 10శాతం స్థలాలను 20శాతం రిబేటుపై కేటాయించాం. స్థలాల కేటాయింపునకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలి. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను మార్చి 5లోగా స్థలాలు కోరిన ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలి. దానికొచ్చిన డిమాండ్ బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలు పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి.

- జగన్‌, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:

ఇదీ చదవండి- 'టీకా వల్లే నా కూతురు మృతి.. వాళ్లు రూ.1000కోట్లు చెల్లించాలి'

ABOUT THE AUTHOR

...view details