రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన ఏపీ సీఎం జగన్.. బర్డ్ ఆస్పత్రిలో పిల్లల గుండె జబ్బుల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం.. అలిపిరి శ్రీవారి పాదాల దగ్గర గోమందిరం, ఆధునికీకరించిన అలిపిరి కాలినడక మార్గాన్ని ప్రారంభించారు.
ఇవాళ, రేపు తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్.. రాత్రికి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. తర్వాత తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుని..ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం ఐదున్నర గంటలకు శ్రీవారి దర్శనం చేసుకోనున్న జగన్.. ఎస్వీబీసీ (SVBC) కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభిస్తారు. అలాగే..కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించనున్న సీఎం రైతు సాధికార సంస్థ, తితిదే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.