తెలంగాణ

telangana

ETV Bharat / city

రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ

బడ్జెట్‌ సమావేశాల్లో తెరాస ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్​ వ్యూహాలు రచిస్తోంది. ప్రజా సమస్యలపై గట్టి పోరాటం చేస్తూనే.. ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆపార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలు, ఉచిత విద్యుత్ హామీ, రుణమాఫీ, రైతుబంధు లాంటి అంశాలను ప్రస్తావించనున్నారు.

రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం

By

Published : Sep 9, 2019, 11:42 PM IST

రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం
రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆపార్టీ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పోడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హాజరయ్యారు.

ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజరు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనారోగ్యం కారణంగా గైర్హాజరు కాగా... మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరైనప్పటికీ సీఎల్పీ సమావేశానికి దూరంగా ఉన్నారు.

ప్రజాసమస్యలపై గళమెత్తుతాం​
సభలో కాంగ్రెస్ శాసనసభ్యుల సీట్లు మార్చడంపై స్పీకర్‌కు లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించింది. ఎంఐఎం తెరాసకు మిత్రపక్షంగా ఉన్నందున ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై గొంతెత్తాలని ఎమ్మెల్యేలు అంతా అభిప్రాయపడ్డారు. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలు, పోడు భూముల వ్యవహారం, ఉచిత విద్యుత్ హామీ, రుణమాఫీ అమలు, రైతుబంధు లాంటి పలు అంశాలను ప్రస్తావించనున్నారు.

ఇవీ చూడండి: ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపింది: సీఎం కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details