CJI at Tirumala : వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకుంది. ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించిన అనంతరం తర్వాత 1.45 నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
CJI NV RAMANA at Tirumala : తిరుమలేశుని సేవలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
CJI at Tirumala : వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజల తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యాయి.
Justice NV Ramana At Tirumala : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఛైర్మన్, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు సీజేఐ అభినందించారు. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
CJI NV RAMANA at Tirumala : బుధవారం.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐకి.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణను భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా కలిశారు.