నేడు దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష (civil services prelims 2021) జరగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఏపీలో విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్షకు 10 నిమిషాల ముందు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశాన్ని(upsc exams 2021) నిలిపివేయనున్నారు. అన్ని కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అభ్యర్థులుకు అధికారులు సూచించారు.
civil services prelims 2021: సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యం - సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2021 అప్డేట్స్
దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రలిమ్స్ పరీక్ష నేడు (civil services prelims exam 2021)జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆరు కేంద్రాల్లో రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే హైదరాబాద్, వరంగల్‌లో... అభ్యర్థులు హాల్‌టికెట్లు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
civil services prelims 2021
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌ఆర్టీసీ (tsrtc) ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. పరీక్ష జరిగే హైదరాబాద్, వరంగల్‌లో... అభ్యర్థులు హాల్‌టికెట్లు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మెట్రో, ఏసీ బస్సులు సహా అన్ని రకాల సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఇదీచూడండి:Mahesh Bhagwat: మరోమారు వాట్సాప్ 'గురు' హవా.. సివిల్స్‌లో వందమందికి పైగా ఎంపిక